8న సిట్ ముందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్

8న సిట్ ముందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్
  • శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు సిట్‌‌‌‌‌‌‌‌ విచారణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ కు సిట్‌‌‌‌‌‌‌‌మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని కోరింది. ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌కు గురైన ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలను నోటీసులో పేర్కొంది. బండి సంజయ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరికి కూడా నోటీసులు అందించింది. సిట్ నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యేందుకు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ అంగీకరించారు. 

కాగా, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాల నుంచి కూడా బండి సంజయ్ కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. వీటిని కూడా ఆయన సిట్‌‌‌‌‌‌‌‌ అధికారులకు అందించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.