రసాయనాల మూలకాల పేర్లు చెబుతున్న చిన్నారి

రసాయనాల మూలకాల పేర్లు చెబుతున్న చిన్నారి

రసాయన శాస్తంలో మూలకాల పేర్లు చెప్పమంటే చాలా మంది విద్యార్ధులు వణికి పోతుంటారు. కానీ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఆరేళ్ల చిన్నారీ అలవోకగా సాగ్నిక చెప్పేస్తుంది. ఒకటో తరగతి చదువుతున్న ఆమె 118 మూలకాలను 30 సెకన్లలో చెప్పి కలాం వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ రికార్డులు సాధించింది. సాగ్నికకు రసాయన శాస్త్రంతో పాటు జనరల్ సైన్స్ పై ఆసక్తి ఉందన్నారు ఆమె తల్లిదండ్రులు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆవర్తన పట్టిక లోని 118 మూలకాలను కూతురుకు చెప్పానంటున్నారు తల్లి దివ్య. తన కూతురు రెండు వరల్డ్ రికార్డులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. సాగ్నికకు జ్ఞాపక శక్తి ఎక్కువ అని, ఏవిషయమైనా ఒక్కసారి చెపితే గుర్తు పెట్టుకుంటుందన్నారు టీచర్లు.

ఇవి కూడా చదవండి:

ఓ వైపు బాంబుల వర్షం... మరో వైపు ప్రజా ప్రతినిధుల కిడ్నాప్

రాముడి కళ్యాణానికి సిద్ధమవుతున్న తలంబ్రాలు