- ఎస్‌ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి
గండిపేట, వెలుగు: విద్యార్థులు అన్ని రంగాల్లో పాల్గొన్నప్పుడే విజ్ఞానవంతులుగా ఎదుగుతారని ఎస్‌ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ పట్లోళ్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గండిపేట మండలం హైదర్షాకోట్ సాయిరాంనగర్‌లోని ఎస్‌ఎంపీ స్కూల్‌లో బుధవారం బాలోత్సవం 2025–26 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.
