IND vs AUS: మోత మోగిస్తున్న మంధాన.. 50 బంతుల్లోనే సెంచరీ.. భారీ టార్గెట్‌లో ఆసీస్‌ను కంగారెత్తిస్తున్న ఇండియా

IND vs AUS: మోత మోగిస్తున్న మంధాన.. 50 బంతుల్లోనే సెంచరీ.. భారీ టార్గెట్‌లో ఆసీస్‌ను కంగారెత్తిస్తున్న ఇండియా

ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం (సెప్టెంబర్ 20) ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ స్మృతి మందాన మెరుపు సెంచరీతో ఆసీస్ కు చుక్కలు చూపిస్తోంది. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి ఇండియా భారీ లక్ష్య ఛేదనలో ఇండియా ఆశలు సజీవంగా ఉంచింది. ప్రస్తుతం మంధాన 111 పరుగులతో క్రీజ్ లో ఉంది. 17 ఓవర్ మూడో బంతికి ఆలనా కింగ్ బౌలింగ్ లో డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ కొట్టి స్మృతి సెంచరీ మార్క్ అందకుంది. ఈ టీమిండియా ఓపెనర్ ఇన్నింగ్స్ లో 16 ఫోర్లతో పాటు నాలుగు సిక్సర్లు ఉన్నాయి.  

50 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న స్మృతి మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మెగ్ లానింగ్ 45 బంతుల్లో సెంచరీ చేసి టాప్ లో ఉంది. మందాన సెంచరీతో పాటు కౌర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో భారీ లక్ష్య ఛేదనలో ఇండియా దూసుకెళ్తుంది.  413 పరుగుల టార్గెట్ కళ్ళ ముందు కనిపిస్తున్నా కౌర్ సేన అసలు వెనక్కి తగ్గడం లేదు. ఓపెనర్ ప్రతీక్ రావల్, హర్లీన్ డియోల్ విఫలమైనా కౌర్ తో కలిసి స్మృతి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి  మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేసింది. ప్రస్తుతం ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్రీజ్ లో మందాన (120), కౌర్ (52) ఉన్నారు. 

Also Read:-వన్డేల్లో టీ20 విధ్వంసం: బ్యాటింగ్‌లో ఆస్ట్రేలియా విశ్వరూపం.. ఇండియా టార్గెట్ 413 పరుగులు

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయింది. బెత్ మూన్ (75 బంతుల్లో 23 ఫోర్లు, సిక్సర్ తో 138) భారీ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచింది. జార్జియా వోల్ (81), ఎల్లిస్ పెర్రీ (68) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. టీమిండియా బౌలర్లలో అరుంధతి రెడ్డి మూడు.. దీప్తి శర్మ, రేణుక ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టారు.