
కోల్‌కతా: చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను.. లా7:49 AM 8/1/20257:51 AM 8/1/2025ర్డ్స్, మాంచెస్టర్ టెస్ట్‌ల్లో ఆడిస్తే బాగుండేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఆడించకపోవడం వల్ల ఇండియా కొన్ని వ్యూహాలను మిస్సయిందన్నాడు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ చివరి రెండు రోజుల్లోనే నాణ్యమైన స్పిన్నర్లు చాలా ప్రభావం చూపిస్తారని చెప్పాడు. ‘లార్డ్స్, మాంచెస్టర్‌లో కుల్దీప్ ఆడితే బాగుండేది. లేదంటే బర్మింగ్‌హామ్‌లో ఆడించినా ఫలితం మరోలా ఉండేది. నాణ్యమైన స్పిన్నర్ లేకుండా టెస్ట్‌లో నాలుగు, ఐదో రోజు ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేయడం చాలా కష్టం. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా మిడిలార్డర్‌ను ఇంగ్లిష్ బౌలర్లు ఆలౌట్ చేయలేకపోయారు.
ఐదో రోజు పిచ్‌పై 143 ఓవర్లు ఆడి డ్రా చేసుకున్నారు. కొంచె కఠినమైన పిచ్‌పై కాస్త మలుపు తిరిగితే స్పిన్నర్లు విపరీతమైన ప్రభావం చూపిస్తారు. ఇంగ్లిష్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం వల్ల 20 వికెట్లు తీయలేకపోయింది. గతంలో గొప్ప జట్లలో గొప్ప స్పిన్నర్లు ఉన్నారు. షేన్ వార్న్, మురళీధరన్, గ్రేమ్ స్వాన్, పనేసర్, కుంబ్లే, హర్భజన్, అశ్విన్ ఇలా చాలా మంది ఉన్నారు. కాబట్టి భవిష్యత్‌లో ఇండియా టీమ్ కొనసాగించాల్సిన స్పిన్నర్ కుల్దీప్ అని నేను భావిస్తున్నా’ అని దాదా పేర్కొన్నాడు. ఇక ఐదో టెస్ట్‌కు కుల్దీప్‌ను పక్కనబెట్టడం సరైన నిర్ణయమేనని వెల్లడించాడు. ఎందుకంటే వికెట్ పేసర్లకు చాలా అనుకూలంగా ఉందన్నాడు. ఆఖరి టెస్ట్‌లో ఇండియా గెలిచి సిరీస్‌ను డ్రా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అన్షుల్ కాంబోజ్ ఆటపై ఇప్పుడే అంచనాకు రావొద్దని అభిమానులను కోరాడు. సీమర్ ముకేశ్ కుమార్‌ను తీసుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సౌరవ్ అన్నాడు.