
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. డివైడర్ ను ఢికొట్టింది. ఎయిర్ బెలూర్ ఓపెన్ కావడంతో ప్రాణపాయం తప్పింది. అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెల్లవారుఝామున రోడ్డుపై రాకపోకలు పెద్గగా లేకపోవడంతో ముప్పు తప్పింది. జన సంచారం లేకపోయినా ఐటీ ఉద్యోగుల రాకపోకలు జరిగే సమయం కావడంతో ప్రమాదం జరిగిన సమాచారం కలకలం రేపింది. కారు డివైడర్ ను ఢీకొడుతూ దూసుకెళ్లిన సమయంలో ఎలాంటి వాహనాల రాకపోకలు లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది.