
కొలంబో: ఇండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న ఫస్ట్ వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ టూర్ కు కెప్టెన్ గా వ్యవహరించే అరుదైన అవకాశం ఓపెనర్ శిఖర్ ధావన్‌కు దక్కిన విషయం తెలిసిందే. కోహ్లి సారథ్యంలోని టీమ్ ఇంగ్లండ్ లో ఉండటంతో మరో టీమ్ ను ధావన్ కెప్టెన్సీలో శ్రీలంక వెళ్లింది. తొలిసారి ఇండియన్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండే అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకోవాలని ధావన్ చూస్తున్నాడు. అటు సొంతగడ్డపై గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక చూస్తుంది.