గరిడేపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలోని శ్రీమాతా అరవింద ధ్యాన మందిరం 54వ వార్షికోత్సవాలు ఫిబ్రవరి 18 గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు గ్రామంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, భజనలు, ప్రభ బండ్లు, కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను శ్రీ అరబిందో గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఘంటా లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ మాశెట్టి శ్రీహరి, ఘంటా సుధాకర్ రెడ్డి, నాయకులు సుందరి నాగేశ్వరరావు, మేకల శోభన్ బాబు, సంధ్యాల బక్కయ్య, చాట్ల సైదులు, బచ్చు ఉపేందర్, సొసైటీ గ్రామాల సర్పంచులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
