13 ఏళ్లుగా దొరక్కుండా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి

13 ఏళ్లుగా దొరక్కుండా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి
  • ఎట్టకేలకు బెంగళూరులో కరీంనగర్ పోలీసులకు పట్టుపడిన శ్రీనివాసరావు
  • నకిలీ బాండ్లతో బ్యాంకులకే టోపీ పెట్టిన నేరస్తుడు
  • బెంగళూరులో అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు
  • 13 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు
  • మెకానికల్ ఇంజనీరింగ్ చదివి.. లెక్చరర్ గా పనిచేస్తూ తొందరగా ధనవంతుడైపోవాలని నేరాలు
  • నిందితుడు శ్రీనివాసరావు నిజామాబాద్ పట్టణ వాసి

కరీంనగర్: నకిలీ పత్రాలు సృష్టించి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అనేక మందిని మోసం చేయడంతో పాటు, గతంలో నకిలీ కిసాన్ వికాస పత్రాలు తయారీ చేసి బ్యాంకులకే టోపీ పెట్టిన మాజీ నేరస్థుడు కుందన శ్రీనివాస్ రావును బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు. నిందితుని గురించి వివరాలు సీపీ కమలాసన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన కుందన శ్రీనివాస రావు అనే నిందితుడు 13 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.మెకానికల్ ఇంజినీరింగ్ చదివి లెక్చరర్ గా పనిచేసిన నిందితుడు తొందరగా ధనవంతున్ని కావాలనే దురాశతో మోసాలకు పాల్పడ్డాడు. 

గతంలో నకిలీ కిసాన్ వికాస్ పత్రాలను సృష్టించి అనేక బ్యాంకులకు కోటి రూపాయలకు పైగా మోసం చేశాడు. వ్యవహారం బయటపడడంతో గతంలో జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటికి వచ్చాక తిరిగి నకిలీ పేర్లతో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ తో పాటు గుంటూరులో పలు చోట్ల మోసాలకు పాల్పడ్డాడు.నకిలీ ఆధార్ కార్డులతో, నకిలీ పాన్ కార్డులతో మోసాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతనిపై 40కి పైగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదవడంతో అజ్ఞాతం లోకి వెళ్లిపోయాడు. 13 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా అజ్ఞాత జీవితం గడిపిన శ్రీనివాస్ రావును బెంగళూరులో ఉన్నట్లు ధృవీకరించుకున్న కరీంనగర్ పోలీసులు రహస్యంగా వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీనివాసరావు పై కరీంనగర్ జిల్లాలో 23 కేసులున్నాయని కరీనంగర్ సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు.