V6 News

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు వచ్చేశాయి.. దరఖాస్తులు షురూ..

 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు వచ్చేశాయి.. దరఖాస్తులు షురూ..

SSC GD 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 వివరాలను ప్రకటించింది. ఇందులో రాష్ట్రాల వారీగా, అలాగే వివిధ పోలీసు దళాల (CAPFలు, అస్సాం రైఫిల్స్, SSF) వారీగా ఖాళీల వివరాలు ఉన్నాయి. ఈసారి మొత్తం 25 వేల 487 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు రాష్ట్రాలు లేదా దళాలలో ఎన్ని ఖాళీ పోస్టులు  ఉన్నాయో తెలుసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2025.

మొత్తం 25 వేల 487 ఖాళీ పోస్టులను పురుషులు, మహిళలకు ఈ విధంగా కేటాయించారు:

#కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF)    మొత్తం పోస్టులు 14 వేల 595,    పురుషులకు పోస్టులు 13 వేల 135, మహిళలకు 1,460  పోస్టులు కేటయించారు. 
#సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మొత్తం పోస్టులు 5,490, పురుషులకు 5,366 పోస్టులు, మహిళలకు 124 పోస్టులు రిజర్వ్ చేసారు. 
#అస్సాం రైఫిల్స్ (AR)లో మొత్తం పోస్టులు 1,706, పురుషులకు 1,556 పోస్టులు, మహిళలకు 150పోస్టులు ఉన్నాయి. 
#సశస్త్ర సీమా బల్ (SSB)లో మొత్తం పోస్టులు 1,764, పురుషులకు 1,764 పోస్టులు, మహిళలకు  పోస్టులు లేవు.      
#ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో  మొత్తం పోస్టులు 1,293, పురుషులకు 1,099  పోస్టులు, మహిళలకు 194 పోస్టులు ఉన్నాయి. 
#సరిహద్దు భద్రతా దళం (BSF) మొత్తం పోస్టులు  616, పురుషులకు  524 పోస్టులు, మహిళలకు 92 పోస్టులు ఉన్నాయి. 
#స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో మొత్తం పోస్టులు  23, వీటిలో 23  పోస్టులు పురుషులకు   కేటాయించారు. 

మొత్తం పోస్టులు 25,487లో పురుషులకు 23,467 పోస్టులు ఉండగా, మహిళలకు 2,020 పోస్టులు  కేటాయించారు. 

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పాస్ అయి ఉండాలి.

వయస్సు (జనవరి 01, 2026 నాటికి): 18 నుండి 23 సంవత్సరాలు ఉండాలి.

వయస్సు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది (OBCకి  3 సంవత్సరాలు, SC/STకి 5 సంవత్సరాలు).

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు దాదాపు రూ. 21,700 నుండి రూ. 69,100 వరకు జీతం, అలాగే ఇతర అలవెన్సులు లభిస్తాయి.

ఎంపిక విధానం : ఈ ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది

1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT). ఇది ఆన్‌లైన్‌లో జరిగే ఆబ్జెక్టివ్ పరీక్ష. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్,  ఇంగ్లీష్/హిందీకి సంబంధించిన 80 ప్రశ్నలు  మొత్తం 160 మార్కులుకి  ఉంటాయి.

2.శారీరక సామర్థ్య పరీక్ష: పరుగు పరీక్ష ఉంటుంది. పురుషులు 24 నిమిషాల్లో 5 కి.మీ పరుగు, మహిళలు 8.5 నిమిషాల్లో 1.6 కి.మీ పరుగు చేయాల్సి ఉంటుంది.

3.శారీరక ప్రమాణాల పరీక్ష: ఎత్తు, ఛాతీ, బరువు కొలతలు తీసుకుంటారు.

4. వైద్య పరీక్ష: ఉద్యోగానికి సరిపోయే విధంగా ఫిట్‌గా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు.

దరఖాస్తు చేసుకునే విధానం:
* మొదట SSC అధికారిక వెబ్‌సైట్ (https://ssc.gov.in) కి వెళ్లండి.
2. 'నోటీస్ బోర్డ్' లో ఉన్న "CAPFs లో కానిస్టేబుల్ (GD) ..." లింక్‌పై క్లిక్ చేయండి.
3. ముందుగా నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి మీకు అర్హత ఉందో లేదో చెక్ చూసుకోండి.
4. Apply లింక్‌పై క్లిక్ చేసి, కొత్త యూజర్ అయితే మీ ఆధార్ వివరాలతో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి.
5. మీ రిజిస్ట్రేషన్ ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
6. దరఖాస్తు ఫామ్‌ను నింపి, అవసరమైన పత్రాలను (ఫోటో, సంతకం) అప్‌లోడ్ చేయండి.
7. చివరికి దరఖాస్తు ఫీజు చెల్లించండి.
8. ఫామ్‌ను సబ్మిట్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింటవుట్ తీసి పెట్టుకోండి.

 గమనిక: రాష్ట్రాల వారీగా పూర్తి ఖాళీ వివరాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక SSC GD 2025 నోటిఫికేషన్ PDFను చూడాలని సూచించింది.