V6 News

HLL ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. బి.ఫార్మసీ చేసినోళ్లకి మంచి ఛాన్స్..

HLL ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. బి.ఫార్మసీ చేసినోళ్లకి మంచి ఛాన్స్..

హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ (HLL) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.  

పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ బ్రిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్.  

ఎలిజిబిలిటీ: బి.ఫార్మా, బీఎస్సీ, డీఎంఎల్టీ, ఎంఎస్సీ, ఎంఎలీ, బీఎంఆర్, ఎంబీఏ లేదా ఎంహెచ్ఎస్ఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హాస్పిటల్, ఫార్మా లేదా డయాగ్నస్టిక్ పరిశ్రమలో ఏడాది అనుభవం ఉండాలి. 

గరిష్ట వయస్సు: 2025, డిసెంబర్ 1 నాటికి 37 ఏండ్లు.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 02. లాస్ట్ డేట్: డిసెంబర్ 17.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు lifecarehll.com వెబ్ సైట్ సందర్శించండి.