నేషనల్ లెవెల్ గేమ్స్ కు కేజీబీవీ స్టూడెంట్లు ఎంపిక

నేషనల్ లెవెల్ గేమ్స్ కు కేజీబీవీ స్టూడెంట్లు ఎంపిక

నేరడిగొండ , వెలుగు : నేరడిగొండ మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్ స్టూడెంట్లు నేషనల్ లెవెల్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు  జిల్లా సాఫ్ట్ బాల్ సెక్రటరీ గంగాధర్ తెలిపారు. ఇటీవల మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో కేజీబీవీ స్టూడెంట్లు ఆదిలాబాద్ జిల్లా తరఫున ఆడి సెకండ్ ప్లేస్ లో నిలిచారు .

ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండలానికి చెందిన కేజీబీవీ స్టూడెంట్లు వనిత, శిరీష, అలేఖ్య నేషనల్ లెవెల్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరు బీహార్ రాష్ట్రంలోని పాట్నా లో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు . వీరిని కేజీబీవీ ఎస్ఓ రజిత, పీఈటీ స్నేహ, కోచ్ రవి, వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, టీచర్లు అభినందించారు .