కూలిపని చేసుకుంటూ చదివి ఎన్ఐటీలో సీటు

కూలిపని చేసుకుంటూ చదివి ఎన్ఐటీలో సీటు
  •  కెమికల్ ఇంజనీరింగ్​లో చేరిన తమిళనాడుకు చెందిన రోహిణి

తిరుచిరాపల్లి: కూలిపని చేస్తేగానీ పూట గడవని పరిస్థితి ఆ కుటుంబానిది.  అలాంటి కుటుంబంలో ఓ అమ్మాయి తల్లిదండ్రులతో పాటు పనికి వెళ్తూనే ఇంటర్ పూర్తిచేసింది. గట్టి సంకల్పంతో చదివి నేషనల్ ఇనిస్టిట్యూట్​ టెక్నాలజీ(ఎన్ఐటీ)తిరుచ్చిలో సీటు కొట్టింది. ఆమే తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన గిరిజన బాలిక రోహిణి. జేఈఈ మెయిన్​లో 73.8 శాతం స్కోర్​తో కెమికల్ ఇంజనీరింగ్​లో జాయిన్ అయింది.

 దీంతో తిరుచ్చిలోని ఎన్ఐటీలో చేరిన తొలి గిరిజన బాలికగా రోహిణి రికార్డుకెక్కింది. అయితే, ఫీజు కట్టే పరిస్థితి లేదని తెలిసి తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. రోహిణి ఫీజు  ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో రోహిణి కెమికల్ ఇంజనీరింగ్​లో జాయిన్ అయింది. తనకు సాయం చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.