సుధీర్ బాబు హరోం హరోం హర టీజర్ రిలీజ్

 సుధీర్ బాబు హరోం హరోం హర టీజర్ రిలీజ్

 సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. బుధవారం ఫస్ట్ సాంగ్‌‌ను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్‌‌ సాంగ్‌‌కు ‘హరోం హరోం హర.. దుర్వార దుర్మార్గ మనచరా.. హరోం హరోం హర..  ధన్వీర దండించు హర’ అంటూ కళ్యాణ్ చక్రవర్తి  త్రిపురనేని పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి  పాడగా, చైతన్ భరద్వాజ్ ఎడిషనల్ వోకల్స్ అందించారు. హీరో పాత్రకు సంబంధించిన జర్నీని ఇందులో చూపించారు. మునుపెన్నడూ లేని ఇంటెన్స్ క్యారెక్టర్‌‌‌‌లో సుధీర్ కనిపిస్తున్నాడు. మాళవిక శర్మ హీరోయిన్‌‌. సునీల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.