రాహుల్ ఇంటికి త్రిపుర మాజీ ఎమ్మెల్యేలు

రాహుల్ ఇంటికి త్రిపుర మాజీ ఎమ్మెల్యేలు

త్రిపురలో రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ బీజేపీకి భారీ షాక్ తగిలింది. అధికార పార్టీ బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులుకు రాజీనామా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ సాహాలు ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తాజాగా వీరిద్దరూ రాహుల్ గాంధీని కలిసేందుకు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు.

త్రిపురలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు.  అయితే రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. త్రిపురలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 60. వీరిద్దరి రాజీనామాతో అధికారంలో ఉన్న బీజేపీ బలం 33కు చేరుకుంది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీని వీడతారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ త్రిపుర అధ్యక్షుడు మాణిక్ సాహా కొట్టిపారేశారు. బీజేపీకి తగినంత బలం ఉందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మేడారం ప్రసాదం.. బుక్​ చేస్తే  డోర్ డెలివరీ  

ఐపీఎల్‌‌ సీజన్‌‌ కు ధోనీ రెడీ