Rajinikanth House: మూడు రోజులుగా వరద నీటిలో సూపర్ స్టార్ ఇల్లు

Rajinikanth House: మూడు రోజులుగా వరద నీటిలో సూపర్ స్టార్ ఇల్లు

తన జీవితం గురించి..తను జీవితం ఎలా మొదలైంది అనేది చెప్పుకోవటానికి ఎప్పుడూ సిగ్గుపడని సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రజినీకాంత్ మాత్రమే. ఎందుకంటే అతని సాధారణమైన జీవన విధానం ఎందరికో స్ఫూర్తిదాయకం. 

ప్రస్తుతం తమిళనాడులో మిచౌంగ్ తుఫాను వలన..ఎంతో మంది పేదవాళ్ల బతుకులు అతలాకుతలం అయ్యాయి. రోజు టీవీల్లోనూ,పేపర్లలోనూ నిరాశ్రయుల పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా, ఈ వరద ప్రభావం సాధారణ ప్రజలతో పాటు..సెలబ్రెటీస్ ఇళ్లపై కూడా చూపుతుంది.

ప్రస్తుతం రజినీకాంత్ కుటుంబం పోయిస్ గార్డెన్ లోనే నివాసముంటుంది. అక్కడ రజినీకాంత్ ఇంటి చుట్టూ వరదనీరు చేరిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాదాల లోతు వరద నీటిలో రజినీ ఇల్లు మునిగి కనిపిస్తుంది. గొప్ప గొప్ప సినీ ప్రముఖుల ఇళ్ల పరిస్థితే ఇలా ఉంటే..ఇక సామాన్య ప్రజల పరిస్థితిని ఊహించండి అంటూ ఈ వీడియో చూసినవారు..ట్వీట్స్ చేస్తున్నారు. 

ఇక రీసెంట్గా విష్ణు విశాల్తో పాటు అమీర్ ఖాన్ కూడా ఈ తుఫాన్ లో చిక్కుకుపోవడం భయాందోళనలకు గురిచేసింది.ఇప్పటికీ  ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతూనే ఉంది. ఈ భారీ వర్షాల కారణంగా సాయం కోసం ఎదురు చూస్తోన్న వరద బాధితుల కోసం రజినీకాంత్ రూ.10 కోట్లు విరాళం ప్రకటించి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.ఇప్పటికే సూర్య,కార్తి వంటి స్టార్స్ కూడా విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రజినీకాంత్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తోన్న లాల్ సలామ్ సినిమాతో పాటు లోకేష్ కానగరాజ్, జై భీమ్ డైరెక్టర్ జ్ఞానవేల్ తో సినిమాలు చేస్తోన్నారు. జైలర్ వంటి భారీ సక్సెస్ తర్వాత వస్తోన్న సినిమాలు కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.