V6 News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో సందడి చేశారు.శనివారం ( డిసెంబర్​ 13)  విఐపి విరామ సమయంలో రజనీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

 తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేసిన ఆయన,  వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపానికి చేరుకున్న రజనీకాంత్‌ కుటుంబానికి వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు. 

టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.