మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు

మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. మరాఠా రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని అత్యన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో మరాఠీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న శివసేన సర్కారు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. మహారాష్ట్ర సర్కార్ గత ఏడాది ఆగస్టులో మరాఠాలకి  ఉద్యోగాలల్లో 12 శాతం కోటా కల్పించిన విషయం తెలిసిందే. 
పునః పరిశీలన అవసరం లేదు: సుప్రీంకోర్టు
మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది సుప్రీంకోర్టు. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వబడిందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 50 శాతం రిజర్వేషన్ పరిమితి నిర్ణయంపై పునః పరిశీలించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. 50 శాతం మరాఠా రిజర్వేషన్లు పరిమితి ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. పీజీ  మెడికల్ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయని,గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.