సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటకు చెందిన యువతి స్పెయిన్ నుంచి సూర్యాపేటకు వచ్చి ఓటును వినియోగించుకుంది. సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కుమార్తె కొప్పుల ఇందురెడ్డి బిజినెస్ నిమిత్తం కొన్ని రోజులుగా స్పెయిన్ దేశంలో ఉంటోంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్పెయిన్ నుంచి మంగళవారం హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి సూర్యాపేటకు వచ్చిన ఇందు రెడ్డి సూర్యాపేటలోని 30 వ వార్డులో ఓటు వినియోగించుకొని తిరిగి స్పెయిన్ కు వెళ్లిపోయింది.
ఓటేయ్.. చికెస్ తీసుకో
మిర్యాలగూడ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడలో ఓటింగ్ ప్రక్రియ నడుస్తుండగా మరోవైపు ఆయా వార్డుల అభ్యర్థులు ఓటు వేసిన అనంతరం చికెన్ కోసం చిట్టీలు ఇచ్చారు. దీంతో ఓటర్లు ఓటు వేయడం కోసం క్యూలో నిలబడినట్లు చికెన్ కోసం కూడా క్యూలో ఉండి తీసుకెళ్లారు.
కల్పవృక్ష వాహనంపై వెంకటేశ్వరుడు
యాదాద్రి, వెలుగు: స్వర్ణగిరిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో మూడవరోజైన బుధవారం శ్రీ పెరుంబుదూర్‌కు చెందిన శ్రీ శ్రీ శ్రీ ఎంబార్ రామానుజ జీయర్ స్వామి విచ్చేసి భక్తులకు మంగళాశాసనాలు అందజేశారు. సాయంత్రం పల్లకీ సేవలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు.
