హైదరాబాద్‌‌‌‌లో టీ20 వరల్డ్‌‌కప్‌‌!

హైదరాబాద్‌‌‌‌లో టీ20 వరల్డ్‌‌కప్‌‌!
  • అహ్మదాబాద్‌‌‌‌లో  ఫైనల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు గుడ్‌‌ న్యూస్‌‌.  ఐసీసీ మెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌కప్‌‌లో కొన్ని మ్యాచ్‌‌లు హైదరాబాద్‌‌ ఉప్పల్‌‌ స్టేడియంలో జరగనున్నాయి. అదే జరిగితే ఐసీసీ ఈవెంట్‌‌కు భాగ్యనగరం తొలిసారి ఆతిథ్యమిచ్చినట్టు అవుతుంది. వచ్చే అక్టోబర్‌‌–నవంబర్‌‌లో ఇండియా వేదికగా టీ20 వరల్డ్‌‌కప్‌‌ జరగనుంది. శుక్రవారం జరిగిన అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో ఈ మెగా ఈవెంట్‌‌ ఆతిథ్యానికి బీసీసీఐ ప్రాథమికంగా తొమ్మిది సిటీలను ఎంపిక చేసింది. హైదరాబాద్‌‌ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, లక్నో, కోల్‌‌కతా, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్‌‌ ఈ లిస్ట్‌‌లో ఉన్నట్టు సమాచారం. వరల్డ్‌‌ లార్జెస్ట్‌‌  క్రికెట్‌‌ స్టేడియం అయిన అహ్మదాబాద్‌‌ నరేంద్ర మోడీ స్టేడియంను ఫైనల్‌‌ వేదికగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై బోర్డు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వేదికలపై తుది నిర్ణయం తీసుకుంటామని కౌన్సిల్‌‌ పేర్కొంది. అయితే, టీ20   కొన్ని మ్యాచ్‌‌లు తెలంగాణ రాజధానిలో జరుగుతాయని హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్‌‌ మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌ శనివారం ట్వీట్‌‌ చేశాడు. ఎన్నో చర్చల తర్వాత ఐసీసీ ఈవెంట్‌‌కు వేదికగా హైదరాబాద్‌‌ తొలిసారి ఎంపికైందన్నాడు.