టీ20 వరల్డ్ కప్: టీమిండియా టార్గెట్ 133

V6 Velugu Posted on Nov 08, 2021

దుబాయ్: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం భారత్ నమీబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియాకు 133 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నమీబియా బ్యాటర్లలో దేవిడ్ వైజ్ అత్యధికంగా 26 పరుగులు చేయగా.. స్టీఫన్ బార్డ్ 21 మినహా మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లలో రవిచంద్ర అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బూమ్రా 2 వికెట్లు తీశారు. 
 

Tagged Team india, T20 World Cup: IND vs NAM, India vs Namibia, Target133

Latest Videos

Subscribe Now

More News