బుమ్రా వర్క్లోడ్పై నజర్‌‌‌‌! మే 19న అఫ్గానిస్తాన్తో సిరీస్లకు జట్ల ఎంపిక

బుమ్రా వర్క్లోడ్పై నజర్‌‌‌‌! మే 19న అఫ్గానిస్తాన్తో సిరీస్లకు జట్ల ఎంపిక

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌‌‌‌తో సిరీస్‌‌‌‌ల కోసం టీమిండియా ఎంపికపై బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది. స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా వర్క్‌‌‌‌లోడ్‌‌‌‌పైనే ఇందులో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. బుమ్రాను ఏకైక టెస్ట్‌‌‌‌ లేదా మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో ఏదో ఒక దానికే పరిమితం చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ సిరీస్‌‌‌‌ల కోసం మంగళవారం జట్టును ఎంపిక చేయనున్నారు. సూపర్‌‌‌‌ స్టార్లు విరాట్‌‌‌‌ కోహ్లీ, రోహిత్‌‌‌‌ శర్మ వన్డేల్లో బరిలోకి దిగుతుండటంతో ఈ సిరీస్‌‌‌‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఒకవేళ బుమ్రాను ఎంపిక చేయకపోతే ఢిల్లీ పేసర్‌‌‌‌ ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను టీమ్‌‌‌‌లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విజయ్‌‌‌‌ హజారే ట్రోఫీలో 8 మ్యాచ్‌‌‌‌ల్లో 17 వికెట్లు తీసిన ప్రిన్స్‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌లోనూ 12 మ్యాచ్‌‌‌‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విరాట్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి సీమ్‌‌‌‌ డెలివరీ వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను ఆకట్టుకుంది. 

గాయం కారణంగా హర్షిత్‌‌‌‌ రాణా అందుబాటులో లేకపోవడం కూడా ప్రిన్స్‌‌‌‌కు కలిసి రానుంది. టెస్ట్‌‌‌‌ జట్టులో ఎలాంటి ప్రయోగాలు చేయొద్దని కమిటీ భావిస్తోంది. రాబోయే శ్రీలంక, న్యూజిలాండ్‌‌‌‌ టూర్ల నేపథ్యంలో సీనియర్లనే కొనసాగించాలని యోచిస్తున్నారు. ఒకవేళ బుమ్రా ఏకైక టెస్ట్‌‌‌‌ ఆడితే వన్డేలకు విశ్రాంతి ఇస్తారు. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ కొత్త బంతిని పంచుకోనున్నారు.