బెంగళూరులో విషాదం: పక్కింటి వారి టార్చర్ భరించలేక సొంత ఇంట్లోనే టెక్కీ ఆత్మహత్య..

బెంగళూరులో విషాదం: పక్కింటి వారి టార్చర్ భరించలేక సొంత ఇంట్లోనే టెక్కీ ఆత్మహత్య..

బెంగళూరులో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైట్‌ఫీల్డ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ 45 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిర్మాణంలో ఉన్న తన సొంత ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతని పేరు మురళీ గోవిందరాజు. బుధవారం తెల్లవారుజామున తన ఇంటి రెండో అంతస్తులో    ఉరి వేసుకుని కనిపించాడు. అయితే సంఘటనా స్థలంలో పోలీసులకి అతను రాసిన మరణ వాంగ్మూలం(suicide letter) దొరికింది. 

మురళీ తల్లి ఇచ్చిన ఫిర్యాదు, సూసైడ్ లెటర్ ప్రకారం... మురళీ 2018లో ఉషా, శశి నంబియార్ నుండి ఓ ఇంటి స్థలాన్ని కొన్నాడు. వీరు కూడా అక్కడే పక్కనే ఉండే వారు. ఈ మధ్యనే మురళీ  అక్కడ ఇంటి పనులు కూడా మొదలుపెట్టాడు. గత నెలలో ఉషా, శశి నంబియార్‌లు పదే పదే మురళీకి ఫోన్ చేసి కారణం లేకుండా రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని లెటర్లో రాశాడు.

ALSO READ | ఓమ్నికామ్-ఐపీజీ విలీనం: 4 వేల ఉద్యోగుల తొలగింపు, ఫేమస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీల మూసివేత..

మురళీ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో వాళ్ళు కొంతమంది బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) సిబ్బందితో కలిసి ఆయన ఇంటి నిర్మాణ స్థలానికి వచ్చారు. అక్కడ మురళీని  గట్టిగ బెదిరించి, డబ్బు కట్టాల్సిందేనని పట్టుబట్టారు. ఈ వేధింపుల గురించి మురళీ తన తల్లితో చెప్పుకున్నాడు. ఈ వేధింపుల వల్ల తన కొడుకు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడని తల్లి చెప్పింది.

అయితే బుధవారం ఉదయం 6 గంటల సమయంలో కుటుంబికులతో మాట్లాడిన మురళీ తన ఆందోళనలను చెప్పి ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న ఇంటి రెండో అంతస్తుకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 9.30 గంటలకు పని కోసం వచ్చిన ఒకతను ఆయన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దింతో కుటుంబికుల ఫిర్యాదు మేరకు వైట్‌ఫీల్డ్ పోలీసులు ఉషా, శశి నంబియార్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.