క్వార్టర్ ఫైనల్లో అర్జున్

క్వార్టర్ ఫైనల్లో అర్జున్

పనాజీ: ఫిడే వరల్డ్‌‌ కప్‌‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్, తెలంగాణ జీఎం  ఎరిగైసి అర్జున్ క్వార్టర్ ఫైనల్స్‌‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన  ప్రిక్వార్టర్స్ రెండో గేమ్‌‌లో అర్జున్ .. అర్మేనియా మేటి ఆటగాడు లెవాన్ అరోనియన్ ను ఓడించి టోర్నీలో ముందంజ వేశాడు. ఈ గేమ్‌‌లో నల్లపావులతో ఆడిన అర్జున్ తన ఎత్తులతో అరోనియన్‌‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు.

 38వ ఎత్తు తర్వాత అరోనియన్  ఓటమి ఒప్పుకున్నాడు.  తొలి గేమ్‌‌ను డ్రా చేసుకున్న అర్జున్ ఓవరాల్‌‌గా 1.5–0.5 తేడాతో గెలిచి తదుపరి రౌండ్‌‌కు దూసుకెళ్లాడు. పి. హరికృష్ణ  ... పెరూకు చెందిన జీఎం మార్టినెజ్‌‌తో రెండో గేమ్‌‌ను కూడా డ్రా చేసుకున్నాడు. క్వార్టర్స్ బెర్తు కోసం ఈ ఇద్దరూ ఆదివారం  టై బ్రేక్స్ ఆడనున్నారు.