నవంబర్ 17 నుంచి స్కూళ్లలో తనిఖీలు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

నవంబర్ 17 నుంచి స్కూళ్లలో తనిఖీలు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 22 వరకూ సర్కారు స్కూళ్లను ఉన్నతాధికారులు తనిఖీలు చేయనున్నారు. బడుల సేఫ్ అండ్ క్లీన్, విద్యార్థుల శ్రేయస్సు, అభ్యసన సామర్థ్యాల పరిశీలన కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పెషల్ క్యాంపెయిన్ 5.0 పేరుతో ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. 

రంగారెడ్డి జిల్లాకు గురుకులాల సెక్రటరీ సీహెచ్ రమణకుమార్, హైదరాబాద్​కు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి, మేడ్చల్ జిల్లాకు అడల్డ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉషారాణి, యాదాద్రికి అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, జనగామకు సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి, ఖమ్మంకు మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెకర్ శ్రీనివాస్ చారి, సంగారెడ్డికి ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్, కరీంనగర్​కు ఎస్ఎస్ఏ జేడీ రాజీవ్, సిద్దిపేటకు టాస్ జేడీ  సోమిరెడ్డి, నిర్మల్​ కు వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, వరంగల్​ కు జేడీ మదన్ మోహన్, గద్వాలకు హైదరాబాద్ ఆర్జేడీ విజయలక్ష్మీ, భద్రాద్రి జిల్లాకు ఎస్ఎస్ఏ జేడీ వెంకట నర్సమ్మ తదితరులను నియమించారు. ఇలా మొత్తం 33 జిల్లాలకు ఇన్ చార్జీలను అపాయింట్ చేశారు.