
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని జల్‌పల్లి, మరో చెరువును చెత్తతో కలుషితం చేయకుండా అధికారులు తీసుకునే చర్యలను వివరించాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెరువుల రక్షణకు తీసుకునే చర్యలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. ప్రతివాదులైన పలు శాఖల అధికారులకు నోటీసులిచ్చింది. తర్వాతి విచారణను వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. మెట్రో రాకతో పట్టణాల్లో భూముల ధరలు పెరిగాయని ఆక్రమణదారుల కన్ను చెరువులపై పడిందంటూ ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని పిల్‌గా తీసుకోవాలని ఒక జడ్జి లేఖ రాశారు. ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన కోర్టు విచారణ చేపట్టింది.