డిసెంబర్ 31 వరకు తాగునీటిపై స్పెషల్ డ్రైవ్.. మిషన్ భగీరథ అధికారులకు నవీన్ మిట్టల్ ఆదేశం

డిసెంబర్ 31 వరకు తాగునీటిపై స్పెషల్ డ్రైవ్.. మిషన్ భగీరథ అధికారులకు నవీన్ మిట్టల్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా డిసెంబర్ 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను పీఆర్, ఆర్డీ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు.

ఈ నెల 15 నుంచి ప్రారంభమైన డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా మండల బృందాలు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం ఖైరతాబాద్​లోని పీఆర్, ఆర్డీ కమిషనర్​ కార్యాలయంలో ఆయన మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈలు, ఎస్ఈలు, ఈఈలతో (ఇంట్రా, గ్రిడ్) ఉన్నతస్థాయిసమీక్ష నిర్వహించారు.