విమానంలో గుండెపోటు: సౌదీ నుండి హైదరాబాద్ వస్తుండగా తెలంగాణ వ్యక్తి మృతి..

విమానంలో గుండెపోటు: సౌదీ నుండి హైదరాబాద్ వస్తుండగా తెలంగాణ వ్యక్తి మృతి..

ఓ హృదయ విదారక ఘటనలో తెలంగాణకు చెందిన 46 ఏళ్ల వలస కార్మికుడు  ఆగస్టు 6న అంటే బుధవారం సౌదీ అరేబియా నుండి ఇంటికి వెళుతుండగా గుండెపోటుతో మరణించాడు. మృతుడు శ్రీరాముల శ్రీధర్ జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉండేవాడు. అతను తన భార్య, ఇద్దరు కూతుళ్లను పోషించడానికి చాలా ఏళ్లుగా దుబాయ్ సిటీలో పనిచేస్తున్నాడు.

ఆగస్టు 5 రాత్రి శ్రీధర్ హైదరాబాద్‌ వచ్చేందుకు విమానం ఎక్కారు. ఉదయం 1 గంటల ప్రాంతంలో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి సృహ కోల్పోయాడు. దింతో విమాన సిబ్బంది వెంటనే మెడికల్  ఎమర్జెన్సీ  ప్రకటించి విమానాన్ని ముంబైలో ల్యాండ్ చేసింది.

ALSO READ : Gold: మధ్యప్రదేశ్‌లో బయటపడ్డ భారీ గోల్డ్ రిజర్వ్.. కన్ఫమ్ చేసిన శాస్త్రవేత్తలు..

 

విమానాశ్రయంలో వైద్య సిబ్బంది విమానం ల్యాండింగ్ అయిన వెంటనే అతనికి CPR చేసారు. అయితే, శ్రీధర్ డాక్టర్లు చేసిన  ప్రయత్నాలకు స్పందించలేదు, దింతో అతను ముంబై చేరుకునేలోపే మరణించినట్లు ప్రకటించారు.

విమానాశ్రయం నుండి తీసిన ఫుటేజ్‌లో శ్రీధర్ స్ట్రెచర్‌పై పడుకొని ఉండగా ఒ డాక్టర్ అతనికి CPR చేస్తున్నట్లు చూడొచ్చు. అతను గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానం ఉన్న అధికారిక వైద్య  రిపోర్ట్ రావాల్సి ఉంది. 

గత నెల ఏప్రిల్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బెన్నీ అనే 32 ఏళ్ల భారతీయుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కువైట్ నుండి కొచ్చికి ప్రయాణిస్తూ మధ్యలోనే మరణించాడు. దింతో ఆ విమానాన్ని కూడా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ముంబైలో ల్యాండ్ చేసారు. కానీ అతను అప్పటికే మృతి చెందాడు.