
Gold Deposits: చాలా కాలం తర్వాత భారతదేశంలో మరో బంగారు నిక్షేపాలు బయపడ్డాయి. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన తర్వకాల్లో దీనిని గుర్తించారు అధికారులు. మధ్యప్రదేశ్ జబల్పూర్ ప్రాంతంలో ఈ భారీ నిక్షేపాలు ఉన్నట్లు తేలింది.
వివరాల్లోకి వెళితే.. అనేక సంవత్సరాలుగా ఇనుప ఖనిజం తవ్వకాలకు పెట్టింది పేరు జబల్పూర్. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో చేపట్టిన సర్వేలో బంగారు భూమి కింద ఉన్నట్లు గుర్తించారు. సిహోరా తహసీల్‌లోని మహాగవాన్ కియోలారి ప్రాంతంలో సుదీర్ఘ శ్రమ తర్వాత నిక్షేపాలు బయటపడ్డాయి. నమూనాలను పరిశీలించిన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అక్కడి మట్టిలో ఇనుము, రాగి, మాంగనీస్ ఖనిజాలతో పాటు గోల్డ్ సహా ఇతర లోహాలు కూడా ఉన్నాయని నిర్థారించారు.
ALSO READ : Gold Rate: శ్రావణ శుక్రవారం ముందు పెరిగిన గోల్డ్.. ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ర్యాలీ, హైదరాబాద్ రేట్లివే..
ఈ బంగారు నిక్షేపాలు దాదాపు 100 హెక్టార్ల విస్తీర్ణం వరకు వ్యాపించి ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో చేపట్టే తవ్వకాల ద్వారా లక్షల టన్నుల వరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గోల్డ్ దొరకడం ఇదే మొదటిసారి కాదు. కొన్నేళ్ల కిందట పొరుగున ఉన్న కట్ని జిల్లాలో కూడా బంగారు నిక్షేపం బయటపడ్డాయి. జబల్పూర్‌లో ఈ ఆవిష్కరణ ఆశాజనకమైన పరిణామంగా నిపుణులు చెబుతున్నారు. ఇది రాష్ట్ర మైనింగ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందని ఆ ప్రాంతాన్ని సంపన్నవంతంగా మార్చుతుందని వారు చెబుతున్నారు.