
Gold Price Today: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై పది రోజుల్లోనే రెండోసారి టారిఫ్ పెంపును ప్రకటించారు. దీంతో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా 50 శాతం సుంకాలను అమలు చేస్తున్నారు. అయితే దీనిని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ క్రమంలో పెరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లు బంగారం బెటర్ అని భావించటంతో రిటైల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఇదే సమయంలో వెండి కూడా పెరుగుదలను చూస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేలు పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 400, ముంబైలో రూ.9వేల 400, దిల్లీలో రూ.9వేల 415, కలకత్తాలో రూ.9వేల 400, బెంగళూరులో రూ.9వేల 400, కేరళలో రూ.9వేల 400, పూణేలో రూ.9వేల 400, వడోదరలో రూ.9వేల 405, జైపూరులో రూ.9వేల 415, మంగళూరులో రూ.9వేల 400, నాశిక్ లో రూ.9వేల 403, మైసూరులో రూ.9వేల 400, అయోధ్యలో రూ.9వేల 415, బళ్లారిలో రూ.9వేల 400, నోయిడాలో రూ.9వేల 415, గురుగ్రాములో రూ.9వేల 415 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేల 200 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 255, ముంబైలో రూ.10వేల 255, దిల్లీలో రూ.10వేల 270, కలకత్తాలో రూ.10వేల 255, బెంగళూరులో రూ.10వేల 255, కేరళలో రూ.10వేల 255, పూణేలో రూ.10వేల 255, వడోదరలో రూ.10వేల 260, జైపూరులో రూ.10వేల 270, మంగళూరులో రూ.10వేల 255, నాశిక్ లో రూ.10వేల 258, మైసూరులో రూ.10వేల 255, అయోధ్యలో రూ.10వేల 270, బళ్లారిలో రూ.10వేల 255, నోయిడాలో రూ.10వేల 270, గురుగ్రాములో రూ.10వేల 270గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.94వేల వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 2వేల 550గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 27వేల వద్ద ఉంది.