
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్ రెండో ఫేజ్‌లో ఐపీఎస్ ఆఫీసర్, నేషనల్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ అభినవ్ పోటీపడి గోల్డ్ మెడల్ నెగ్గారు. గచ్చిబౌలిలోని శాట్జ్ షూటింగ్ రేంజ్‌లో మంగళవారం జరిగిన 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ పోటీలో 280/300 స్కోరుతో టాప్ ప్లేస్ సాధించారు.
విమెన్స్ స్కీట్‌లో స్టేట్ టాప్ షూటర్ రష్మీ రాథోడ్ 44/50 స్కోరుతో గోల్డ్ నెగ్గగా, సొనాలీ రాజు 39/50తో సిల్వర్ గెలిచింది. 25 మీటర్ల పిస్టల్, సెంటర్ ఫైర్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్, స్కీట్, డబుల్ ట్రాప్ ఈవెంట్లలో విన్నర్లకు తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ సంఘి మెడల్స్ అందించారు.