మిలియన్ డాలర్ హీరోస్ లో..మీ ఫేవరెట్ హీరో ఉన్నాడా..

మిలియన్ డాలర్ హీరోస్ లో..మీ ఫేవరెట్ హీరో ఉన్నాడా..

పవన్ కళ్యాణ్..సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా ఈ మూవీ USAలో 1 మిలియన్ డాలర్లు రాబట్టిన మూవీల జాబితాలో నిలిచింది. దీంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోల గురుంచి..ఫ్యాన్స్ లో డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. యూఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన తెలుగు హీరోల సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.  

TFIలో అత్యధికంగా 1 మిలియన్ డాలర్లు రీచ్ అయినా.. హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.మొత్తంగా 11 మూవీస్ మహేష్ ఖాతాలో ఉన్నాయి. నేచురల్ స్టార్ నానికి 8 మూవీస్.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కు 7 మూవీస్..అల్లు అర్జున్, ప్రభాస్ కు 5 మూవీస్ , చిరంజీవి – 4 సినిమాలు, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ 3,  వరుణ్ తేజ్ 2  మిలియన్ డాలర్ సినిమాలు – 2 సినిమాలు చొప్పున మిలియన్ డాలర్ సాధించిన లిస్ట్ లో ఉన్నాయి.  

ఇప్పుడు మన తెలుగు హీరోస్ మూవీస్ అన్నీ ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తోన్న మన టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు , మిగతా ఇండస్ట్రీస్ అన్నీ డిస్కస్ చేస్తున్నాయి. దీంతో  1000 కోట్ల టార్గెట్ తో మూవీస్ తీస్తున్న మన తెలుగు డైరెక్టర్స్,హీరోస్ స్టామినాను మెచ్చుకోవాల్సిందే అంటున్నారు సినీ క్రిటిక్స్.