
- ఆసియాలోనే అతిపెద్ద ఆర్సీసీ ఛానెల్‌గా రికార్డులకెక్కిన తాలిపేరు కాల్వ
- లీకులు, పూడిక, ఇంజినీర్ల నిర్లక్ష్యంతో వృథాగా ఛానెల్
- వినియోగంలోకి తెస్తే దుమ్ముగూడెం మండలంలోని అన్నదాతలకు పండగే
- ఇరిగేషన్ ఇంజినీర్లు దృష్టిసారిస్తే వాడుకలోకి వచ్చే అవకాశం
భద్రాచలం, వెలుగు : ఆసియాలోనే అతిపెద్ద ఆర్సీసీ (రీ ఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్) ఛానెల్‌గా రికార్డులకెక్కిన తాలిపేరు కాల్వ అందుబాటులోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని స్థానిక రైతులు ఎదురు చూస్తున్నారు. లీకులు, పూడిక, ఇంజినీర్ల నిర్లక్ష్యంతో ఏండ్ల కొద్దీ ఛానెల్ నిరుపయోగంగా మారింది. ఇరిగేషన్ఇంజినీర్లు కాస్త దృష్టి సారించి రిపేర్లు చేయిస్తే అన్నదాతకు సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయి.
చివరి భూములకు సాగునీరు అందించాలని..
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ కింద దుమ్ముగూడెం మండలంలోని చివరి భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఈ ఛానెల్ కు శ్రీకారం చుట్టారు. 2.65 కిలోమీటర్ల మేర 66 పిల్లర్లపై రూ.3.65కోట్లతో కాల్వలను నిర్మించారు. తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలో ఎల్డీ-4పై నిర్మించిన ఈ ఆర్సీసీ ఛానెల్ ద్వారా మారేడుబాక, సింగారం, గంగారం, నిమ్మలగూడెం, ఎన్.లక్ష్మీపురం, పౌలూరిపేట, గుండువారి గుంపు, రామకృష్ణాపురం, సొందెవారిగుంపు, బండారుగూడెం, నడికుడి గ్రామాల్లోని 3,100 ఎకరాల భూములకు నీరు పారించాలని డిజైన్ చేశారు.
కానీ రెండేండ్లు మాత్రమే ఈ ఛానెల్ ద్వారా నీరు పారింది. ఆ తర్వాత మొత్తం లీకులమయంగా మారి నాటి నుంచి నేటి వరకు రిపేర్లులేక శిథిలావస్థకు చేరుకుంది. కాల్వల్లో పూడిక పేరుకుపోయింది. ఎగువన ఉన్న కాల్వల్లో కూడా భారీగా పూడిక చేరి ఆర్సీసీ ఛానెల్ వరకు నీరు రావడం లేదు. ఇప్పటికైనా ఇరిగేషన్ఇంజనీర్లు చిన్నపాటి రిపేర్లు చేసి ఛానల్‌ను మళ్లీ అందుబాటులోకి తేవాలని పలువురు
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం.
ఈ సమస్య నా దృష్టికి వచ్చింది. ఆర్సీసీ ఛానెల్ పరిశీలించి అవసరమైన పనులకు ప్రతిపాదనలు తయారు చేస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. చాలా కాలం నుంచి నిరుపయోగంగా ఉంది. ఇందుకు గల కారణాలను తెలుసుకుంటాం. వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం.- జానీ, ఈఈ, తాలిపేరు ప్రాజెక్టు