ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ఒక్కరోజు సమావేశం

ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ఒక్కరోజు సమావేశం
  • కరోనా సహా కీలకమైన అంశాల ఆమోదం కోసం ఉభయ సభల సమావేశం

అమరావతి: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అత్యవసరంగా ఒక్కరోజు పాటు సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగి చాలా కాలం అయినందున.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కీలకమైన అంశాలపై సభలో చర్చించి పరిపాలనా ఆమోదం కోసం సమావేశాలు జరపాలని నిర్ణయించారు. కరోనా లాక్ డౌన్ పరిస్థితులు ఉన్నందున కేవలం ఒకరోజు కే సమావేశాలు పరిమితం చేయనున్నారు. అసెంబ్లీ ఉభయ సభల్లో కీలకమైన బిల్లుల ఆమోదం కోసమే సమావేశాలు జరపాల్సి వస్తోంది. సమావేశాల నిర్వహణ పై కసరత్తు కోసం మంత్రివర్గ ఉప సంఘం చర్చించినట్లు సమాచారం.