నాగార్జున సాగర్ లో గెలిచి తీరుతాం

నాగార్జున సాగర్ లో గెలిచి తీరుతాం

హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులు పట్టభద్రులను బెదిరింపులకు గురిచేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదేనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసునని చెప్పారు. బీజేపీకి ఓటు శాతం పెరగడంతో అధికార పక్షంలో ఆందోళన మొదలైందని చెప్పారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా కొన్ని పార్టీలు పనిచేశాయని మండిపడ్డారు బండి సంజయ్. బీజేపీ భయానికి కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడిపిండని తెలిపారు. గట్టి పోటీతో టీఆర్ఎస్ కు 
చుక్కలు మాత్రం బీజేపీ చూపించిందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేవలని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పీవీ నర్సింహరావు ఫోటో పెట్టుకొని వచ్చిండన్నారు.

పీవీ నర్సింహరావు గెలిచిండా .. కేసీఆర్ గెలించిండ అన్నారు. ఉద్యోగులను బెదిరించి, డబ్బులు ఇష్టారాజ్యంగా పంపిణి చేశాడని..2018 లో PRC ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ భవన్ కు సురుకు తగిలి.. సంబురాల్లో మంటలు వచ్చాయని.. అగ్గి దేవుడు కూడా హెచ్చరించాడన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి, ఆర్టీసీ లెక్కనే ఉద్యోగ సంఘాలను రద్దు చేస్తానని బెదిరించారన్నారు. బీజేపీ ప్రజలతోనే ఉంటుదన్న బండి సంజయ్.. గుర్రంపోడు ఘటన మర్చిపోము.. అలాగే  భైంసా ఘటన మర్చిపోమన్నారు. 

నాగార్జున సాగర్ లో గెలిచి తీరుతామన్న సంజయ్.. గుర్తుమీద జరిగే ఎన్నికలు పువ్వు గుర్తు ప్రజల గుండెల్లో ఉందన్నారు. అతి విశ్వాసంతో కాదు.. ఆత్మ విశ్వాసంతో ముందుకు  వెళ్తామన్నారు. కేసీఆర్ నేర్పిన భాషనే మాట్లాడుతున్నానని.. భాష విషయంలో కేసీఆరే నాకు గురువు అన్నారు. ఆయన వద్ద నేర్చుకున్న భాష ఆయనకే అప్పగిస్తమ్ అన్నారు బండి సంజయ్.