ఫలితాల్లో వెల్లడి: కొవాగ్జిన్​ పనితనం 77.8%

ఫలితాల్లో వెల్లడి: కొవాగ్జిన్​ పనితనం 77.8%

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై భారత్​ బయోటెక్​ తయారు చేసిన కొవాగ్జిన్​ వ్యాక్సిన్​ 77.8% పనితనాన్ని చూపించింది. 25,800 మందిపై చేసిన మూడో దశ ట్రయల్స్​లో వ్యాక్సిన్​ మెరుగైన పనితీరు కనబరిచినట్టు వెల్లడైంది. ఆ ట్రయల్స్​కు సంబంధించిన డేటాను వ్యాక్సిన్లపై ఏర్పాటు చేసిన సబ్జెక్ట్​ ఎక్స్​పర్ట్​ కమిటీ(ఎస్​ఈసీ)కి కంపెనీ మంగళవారం అందజేసింది. ఆ డేటాను సమీక్షించేందుకు ఎస్​ఈసీ సమావేశాన్ని నిర్వహించింది. మరిన్ని రివ్యూల కోసం ఆ డేటాను డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ)కి పంపించనుంది. ఇక, కొవాగ్జిన్​కు అనుమతిని కోరుతూ భారత్​ బయోటెక్​ పెట్టుకున్న అప్లికేషన్​కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. అనుమతుల విషయంపై బుధవారం సమావేశం కానుంది. ఇది పూర్తి రివ్యూ మీటింగ్​ కాదని, వ్యాక్సిన్​ నాణ్యత గురించి వివరించేందుకు భారత్​ బయోటెక్​కు ఇది ఓ అవకాశమని డబ్ల్యూహెచ్​వో పేర్కొంది.