చనిపోయిన రైతుల డేటా లేదనడం అవమానించడమే

చనిపోయిన రైతుల డేటా లేదనడం అవమానించడమే

రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు సాయమందించలేమన్న వ్యవసాయ మంత్రి తోమర్ వ్యాఖ్యలను రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే తీవ్రంగా ఖండించారు. తోమర్ వ్యాఖ్యలు కచ్చితంగా రైతులను అవమానించడమేనని ఆయన అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారి వివరాలు తమ వద్ద లేవని కేంద్రం ఎలా చెబుతుంది? అని ఖర్గే ప్రశ్నించారు.

‘ప్రభుత్వం వద్ద 700 మంది రైతుల రికార్డు లేకపోతే.. మహమ్మారి సమయంలో చనిపోయిన లక్షల మంది వ్యక్తుల డేటాను ఎలా సేకరించారు. గత 2 సంవత్సరాలలో కోవిడ్ కారణంగా 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వం ప్రకారం మాత్రం 4 లక్షల మంది మాత్రమే వైరస్ కారణంగా మరణించారు’ అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

అదేవిధంగా  ప్రెస్ గ్యాలరీ మరియు సెంట్రల్ హాల్‌లోకి జర్నలిస్టులకు ప్రవేశానికి పరిమితులు విధించే సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు ఖర్గే లేఖ రాశారు.