55 లక్షలిచ్చిరమ్మని పంపితే నగదుతో పరారైన డ్రైవర్ 

55 లక్షలిచ్చిరమ్మని పంపితే నగదుతో పరారైన డ్రైవర్ 
  • స్థలం కొన్న తాలూకు డబ్బులిస్తే.. నగదు తీసుకుని జూబ్లిహిల్స్ లో కారును వదిలేసి పారిపోయిన డ్రైవర్ శ్రీనివాస్
  • కారు డ్రైవర్ శ్రీనివాస్ స్వస్థలం కృష్ణా జిల్లా

హైదరాబాద్: కోకాపేటలో స్థలం కొన్న తాలూకు డబ్బును.. స్థలం యజమానికి డబ్బులిచ్చి రమ్మని రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కారు డ్రైవర్ శ్రీనివాస్ కు   రూ.55 లక్షల నగదు ఇచ్చి పంపిస్తే.. భారీ మొత్తం చూసి కళ్లు చెదిరాయేమో.. యజమాని బెంజ్ కారు తీసుకుని బయలుదేరిన డ్రైవర్ శ్రీనివాస్.. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 10లో కారు వదిలేసి డబ్బులు తీసుకుని పారిపోయాడు. మధ్యాహ్నం డబ్బు తీసుకుని వెళ్లిన డ్రైవర్ ఎంత సేపటికీ తిరిగి రాకపోగా ఫోన్ స్విచాఫ్ కావడంతో అతని యజమానికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తన కారు జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 10లోనే కనిపించింది. కానీ డ్రైవర్ శ్రీనివాస్.. నగదు ఏమయ్యాయో తెలియలేదు. అతడే చోరీ చేశాడా.. లేక అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది నిర్ధారించుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
హైదరాబాద్ నగరంలోని రియల్ ఎస్టేట్  వ్యాపారి సంతోష్ రెడ్డి కోకాపేటలో స్థలం కొనుగోలు చేశాడు. దానికి సంబంధించి డ్రైవర్ శ్రీనివాస్ కు 55 లక్షలు ఇచ్చి కొకాపెట్ లో నివాసం ఉంటున్న స్థల యజమానికి ఇవ్వమని చెప్పి పంపాడు. మధ్యాహ్నం సమయంలో డ్రైవర్ శ్రీనివాస్ కార్ లో డబ్బులు తీసుకొని వెళ్లాడు. కొంచెం సేపటి తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ కు రియల్టర్ సంతోష్ రెడ్డి ఫోన్ చేయగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.. కోకాపేటకు వెల్లలేదని తెలియడంతో డ్రైవర్ పై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రియల్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న  జూబ్లీహిల్స్ పోలీసులు.. ప్రత్యేక బృందాలుతో డ్రైవర్ శ్రీనివాస్ కోసం గాలింపు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో సంతోష్ రెడ్డి బెంజ్ కార్ ను వదిలేసి డబ్బులు తీసుకొని డ్రైవర్ శ్రీనివాస్ పరారైనట్లు గుర్తించారు. సంతోష్ రెడ్డి వద్ద 6 నెలల నుంచి డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్.. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.