వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపులపై స్టే ఇవ్వలేం

వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపులపై స్టే ఇవ్వలేం
  • పిటిషనర్ల విజ్ఞప్తిని అంగీకరించని హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: వెలమ, కమ్మ సంఘాలకు, సినీ దర్శకుడు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.శంకర్ కు, జీయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదిక అకాడమీకి, శారదాపీఠానికి ప్రభుత్వం ఖరీదైన భూముల్ని తక్కువ ధరకు ఇవ్వడంపై పిల్స్​వేసిన పిటిషనర్లు.. అక్కడ జరిగే నిర్మాణాలు ఆగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా.. హైకోర్టు అందుకు నిరాకరించింది. స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అయితే అక్కడ చేపట్టే నిర్మాణాలు తమ తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నాలుగు వేర్వేరు భూ కేటాయింపులను సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ దాఖలైన పిల్స్​ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎ.రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిల బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరఫు సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదిస్తూ.. ఎకరం వంద కోట్ల విలువైన భూమిని రెండు అగ్ర కులాలకు ప్రభుత్వం చౌకగా ఇవ్వడం అన్యాయమని, రూ. వెయ్యి కోట్ల విలువైన భూమిని రెండు కలాలకు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో 792 కులాలు ఉంటే రెండు అగ్రకులాలకు రూ.500 కోట్లు చొప్పున విలువ చేసే 5 ఎకరాలు చొప్పున భూమి ఇవ్వడం దారుణమన్నారు. అంతే విలువైన భూమిని ఇతర కులాలకు కూడా ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు. వాటిల్లో నిర్మాణాలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా హైకోర్టు అందుకు నిరాకరించింది.