మైతీలను ఎస్టీల్లో చేర్చడంపై.. కోర్టు ఉత్తర్వులు మార్పు

మైతీలను ఎస్టీల్లో చేర్చడంపై.. కోర్టు ఉత్తర్వులు మార్పు

ఇంఫాల్‌‌: మణిపూర్‌‌‌‌లోని మైతీ వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే విషయాన్ని పరిశీలించాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో ఒక పేరాను ఆ రాష్ట్ర హైకోర్టు తొలగించింది. మైతీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ 2023 మార్చి 27న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సిఫార్సు చేసింది. అయితే, హైకోర్టు తీర్పును గిరిజన కుకీ కమ్యూనిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికీ ఘర్షణలు కొనసాగుతున్నాయి. 

ఇప్పటికే ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో 200  మంది ప్రాణాలు కోల్పోయారు. మైతీలను ఎస్టీల్లో చేర్చాలన్న సిఫార్సులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లోని పేరా నంబర్‌‌‌‌ 17(iii)ను తొలగించింది. ఇది చట్ట ప్రకారం లేదని తాజాగా కోర్టు పేర్కొంది. చట్ట ప్రకారం కోర్టులు ఎస్టీ జాబితాను సవరించడం లేదా మార్చడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది.