మద్యానికి బానిసై సానిటైజర్ తాగి వ్యక్తి మృతి

V6 Velugu Posted on Jul 31, 2021

కరీంనగర్ జిల్లా: సానిటైజర్ తాగి వ్యక్తి మరణించిన సంఘటన శనివారం కరీంనగర్ జిల్లాలో జరిగింది.  గన్నేరువరం మండలంలోని.. చాకలివాని పల్లిలో సానిటైజర్ తాగి షేక్ సైదా  మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికుడిగా షేక్ సైదా పని చేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడి దానికి షేక్ సైదా బానిస అయ్యాడు. మద్యం అనుకుని సానిటైజర్ తాగి సైదా మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Tagged sanitizer, man death, , Karim Nagar District

Latest Videos

Subscribe Now

More News