ఢిల్లీలో రైతుల ఆందోళనపై ఫస్ట్ టైం స్పందించిన ప్రధాని

ఢిల్లీలో రైతుల ఆందోళనపై ఫస్ట్ టైం స్పందించిన ప్రధాని

గతం 9రోజులుగా ఢిల్లీలో రైతుల నిరసన చేస్తున్నారు.  ముగ్గురు కేంద్ర మంత్రులతో నాలుగు సార్లు రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. అవి విఫలమై అన్నదాతల ఆందోళల అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పోలీసులు పోల్చిన రబ్బర్ బులెట్ తో  నిన్న ఓ నిరసనకారుడు మృతి చెందాడు. ఈ విషయంపై ప్రధాని మోదీ ఈ రోజు సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన ఎక్స్( ట్విటర్) అకౌంట్ లో  దేశవాప్తంగా ఉన్న రైతుల సమస్యలను తీర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని  తెలిపారు. ఈ క్రమంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, చెరకు కొనుగోలు ధర పెంపునకు ఆమోదం లభించిందని. దీంతో కోట్లాది మంది రైతులు లబ్ధిపొందుతారని గురువారం  X వేదికగా రాసుకొచ్చారు.మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ చెరుకు గిట్టుబాటు ధర పెంచింది. ఈ ధర గతంతో పోలిస్తే క్వింటాల్ కు రూ.25 లు పెరిగింది. పెరిగిన ధర 2024 అక్టోబర్ 1 నుంచి అమలలోకి వస్తుంది.