తండ్రిని రాడ్డుతో కొట్టి చంపి పరారైన కొడుకు

V6 Velugu Posted on Sep 27, 2021

హైదరాబాద్: కన్నతండ్రిపై రాడ్డుతో దాడి చేసికొట్టి గాయపరచి.. ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు ఓ కొడుకు. హైదరాబాద్ పాత బస్తీ టప్పా చభుత్ర పోలీసు స్టేషన్ పరిధిలోని మహబూబ్ కాలనీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ, మానవ సంబంధాలకు మాయని మచ్చలాంటి ఈ ఘటన స్థానికంగా విషాదం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబ్ కాలనీలో అలీ హుసేన్ ఖాన్ తన ముగ్గురు పిల్లలతో నివసించేవాడు. తన పెద్ద కొడుకు అంజద్ అలీఖాన్ తో అతనికి అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో తండ్రిపై ఓ ఇసుప రాడ్ తో దాడి చేసి కొట్టాడు. కాళ్లపై మరియు తల పై తీవ్రంగా దాడులు చేయడంతో తీవ్రంగా గాయపడిన అలీ ఉసేన్ ఖాన్(తండ్రి)ను తన తండ్రి బాత్రూమ్ లో జారీ పడ్డాడని, తీవ్రంగా గాయలయ్యాడని.. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరారయ్యాడు. ఇదే విషయాన్ని మక్బుల్ అనే తన బామ్మర్ది కు ఫోన్ చేసి చెప్పగా.. తన బావ చెప్పిన సమాచారంతో ఆసుపత్రికి వెళ్లిన మక్బుల్  అలీ హుస్సేన్ ఖాన్ పరిస్థితి చూసి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అలీ హుస్సేన్ ఖాన్ రెండో కొడుకుని ప్రశ్నించగా అంజద్ అలీ ఖాన్ దాడి చేసి హత మార్చినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Tagged Hyderabad, , son who beat his father to death, Mahaboob Colony, Tappa Chabutra PS, Ali Hussain Khan, Amjad Ali Khan, Maqbool

Latest Videos

Subscribe Now

More News