ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే రవిశంకర్

కొడిమ్యాల,వెలుగు: తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రం కళ్లు మండుతున్నాయని, అందుకే పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శనివారం కొడిమ్యాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రవ్వాప్తంగా ఆడపడుచులకు కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోందన్నారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణలోనే నేతన్నలకు బతకమ్మ చీరలతో చేతినిండా పని కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జెడ్పీటీసీ పుణుగోటి ప్రశాంతి, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు కృష్ణా రావు, ప్యాక్స్ చైర్మన్ రాజనర్సింగ రావు, ఎంపీడీఓ పద్మజ పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలి 

‘వాగేశ్వరి’ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి 

తిమ్మాపూర్, వెలుగు : ప్రజలు సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని వాగేశ్వరి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్​శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని రామకృష్ణకాలనీలో గల వాగేశ్వరి ఫార్మసీ కాలేజీలో శనివారం వరల్డ్ ఫార్మసీ డే నిర్వహించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు మోడల్ స్కూల్ స్టూడెంట్లకు వ్యాధులపై అవగాహన కల్పించారు. సివిల్ హాస్పిటల్ వారి సహకారంతో కాలేజీలో 60 మంది స్టూడెంట్లు రక్తదానం చేశారు. అనంతరం కాలేజీ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం అవతరణ దినోత్సవం సందర్భంగా కిల్ క్యాన్సర్ అంశంపై వకృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి డా.డి. శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు సీహెచ్ ప్రకాశ్​రెడ్డి, వినోద్, ఫార్మసీ కాలేజీల ప్రిన్సిపల్ డాక్టర్​శ్రీనివాసరెడ్డి, ఆర్.రామకృష్ణ, మోడల్ స్కూల్ లెక్చరర్లు పాల్గొన్నారు.

‘ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌లో ఉద్యోగానికి డబ్బులు చెల్లించొద్దు’

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ(ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌)లోని ప్రాజెక్ట్‌‌‌‌ సైట్‌‌‌‌లో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేసే వారు ఎలాంటి ఉద్యోగానికైనా ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని, మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఫ్యాక్టరీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ దేశంలో వ్యవసాయోత్పత్తిని పెంచడం కోసం నెలకొల్పిన సంస్థ అని  ఆఫీసర్లు తెలిపారు. ఈ క్రమంలో ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ సైట్‌‌‌‌లో వివిధ కాంట్రాక్టు సంస్థలలో ఉద్యోగం కోరే వారి నుంచి డబ్బులు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారని ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యోగాల నియామకంలో ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి

ఎంపీ సంజయ్​కు చందుపట్ల వినతి

పెద్దపల్లి, వెలుగు: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం చొరవ చూపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను బీజేపీ స్టేట్ లీడర్ చందుపట్ల సునీల్ రెడ్డి కోరారు. శనివారం ఆయన  ఎంపీ నివాసంలో సంజయ్​ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ లేకుండా అందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని బండి సంజయ్ ని కోరినట్లు తెలిపారు. సునీల్ వెంట మంథని బీజేపీ లీడర్లు నాగపురి శ్రీనివాస్, రిత్విక్ రెడ్డిఉ న్నారు. 

సింగరేణి శ్రమ దోపిడీ చేస్తుంది

రామగిరి:  సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల శ్రమను యాజమాన్యం దోపిడీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. ఆర్జీ -3 పరిధిలోని జీఎం ఆఫీస్​ఎదుట సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు శనివారం అయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి దృష్టికి  తీసుకెళ్తామన్నారు. ఏఎల్ పీ మైన్ నుంచి బొగ్గు రవాణాకు స్థానిక లారీలకు అవకాశం కల్పించాలని డిమాండ్​ చేశారు.  బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సత్తయ్య, ఎంపీటీసీ ల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మండల ఇన్​చార్జి నాగరాజు, అర్జీ-3 డివిజన్ ఉపాధ్యక్షుడు ప్రసాద్  ఉన్నారు.

క్యాన్సర్ పై అవగాహన కల్పించాలి

ఫ్రీ అంకాలజీ క్యాంపు ప్రారంభం

కరీంనగర్ టౌన్,వెలుగు: క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, దీంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం స్థానిక ట్రినిటీ కాలేజీ ఆవరణలో హైదరాబాద్​లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్​స్టిట్యూట్(ఏఐఓ) తో పాటు హైదరాబాద్ లోని సిటిజన్స్ హాస్పిటల్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి ప్రబలిన తర్వాత ఆందోళన చెందే బదులు ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలన్నారు. అనంతరం ఏఐఓ రీజనల్ డాక్టర్ పాలచర్ల ప్రభాకర్ మాట్లాడుతూ శిబిరంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంవల్ల మొదట్లోనే వ్యాధి లక్షణాలను గుర్తించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుక ప్రయత్నిస్తున్నామన్నారు. తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడమే అత్యంత క కీలకమని వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, కార్పొరేటర్ మేచినేని వనజ, డాక్టర్లు జగదీశ్వర్ గౌడ్, గంగాభవాని, లెక్చరర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. 

గ్రూప్ 1 పరీక్షకు 36 సెంటర్లు

కరీంనగర్ సిటీ, వెలుగు: అక్టోబర్ 16న నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షలు సజావుగా జరిగేలా పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయాలని కరీంనగర్​ కలెక్టర్ కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో గ్రూప్ 1 పరీక్షల సందర్భంగా కాలేజీల్లో వసతుల  ఏర్పాటుపై సంబంధిత అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల హెడ్మాస్టర్లు, ప్రతినిధులతో సమీక్షించారు. గ్రూప్ 1 కోసం కరీంనగర్ ​జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 10 వరకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలు రాసేవారంతా స్పష్టంగా కనబడేలా కచ్చితంగా సీసీ కెమెరాలను అమర్చాలన్నారు. కార్యక్రమంలో అడిషన్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీఐఈఓ రాజలక్ష్మి, తిమ్మాపూర్ తహాసీల్దార్ కనకయ్య పాల్గొన్నారు. 

కాలేజీ కోసం వ్యవసాయ భూములా?

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : వ్యవసాయ కాలేజీ కోసం దళితుల భూమిని లాక్కున్నారని బిజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఆరోపించారు. శనివారం ఆయన సిరిసిల్ల లో మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో దళితులపై నిర్బంధాలు కొనసాగుతున్నాయన్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో దళితుల భూమి సర్వే నంబర్  652 లోని 17ఎకరాల 30 గుంటల భూమి ఉందని, ఎంజాయ్​ మెంట్ సర్వే కింద ఈ భూమిని వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ కోసం తీసుకున్నారన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. 12 మంది దళితుల వద్ద భూమిని తీసుకున్నారని, వెంటనే వారికి ఇంకో చోట భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ

జగిత్యాల, వెలుగు: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులపై తనిఖీలు నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు శనివారం ఐదు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించామని, నిబంధనలు పాటించకుండా ధరల పట్టికలు అందుబాటులో ఉంచని పలు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పట్టణంలోని జ్యోతి హాస్పిటల్ లో అనుమతుల్లో తెలిపిన డాక్టర్ కాకుండా మరొక వైద్యుడితో ఆసుపత్రి నిర్వహిస్తున్నారని, విషయం ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఎల్లారెడ్డిపేటకు బీసీ రెసిడెన్షియల్ కాలేజీ

ఎల్లారెడ్డిపేట,వెలుగు:ఎల్లారెడ్డిపేటకు మహాత్మ జ్యోతీబా పూలే బీసీ బాయ్స్​ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ప్రభుత్వం మంజూరు చేయడాన్ని హర్షిస్తూ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు మంత్రి కేటీఆర్ చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల కోరికను ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే క్లాసులు ప్రారంభించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ లక్ష్మణరావు, ఎంపీపీ రేణుక, ఏఎంసీ చైర్మన్ రమేశ్​గౌడ్, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు నాగరాణి, అనసూయ  తదితరులు పాల్గొన్నారు. 

వృద్ధుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్ సిటీ, వెలుగు: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్​1 వరకు మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వృద్ధుల వారోత్సవాల పోస్టర్ ను కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీ చైర్ పర్సన్ విజయ శనివారం ఆవిష్కరించారు. టీఎన్జీఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబితాకుమారి మాట్లాడుతూ అక్టోబర్​1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు క్రీడా పోటీలు, నడక పోటీలు నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రియాంక, కార్పొరేటర్ జితేందర్, వయో వృద్ధుల సంక్షేమ సంఘాల బాధ్యులు జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.