వేములవాడ, వెలుగు: వేములవాడ అర్బన్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా శెభాష్‌పల్లి సర్పంచ్ తిరుపతియాదవ్ఎన్నికయ్యారు. గురువారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్యాంపు ఆఫీసులో మండల సర్పంచుల సమావేశం జరిగింది. మొదటి రెండున్నర ఏండ్లు అన్నబోయిన తిరుపతి యాదవ్, తర్వాత కాలం ఆరెపల్లి సర్పంచ్ ఇటిక్యాల రాజు అధ్యక్షుడిగా కొనసాగేలా తీర్మానం చేశారు.
ఉపాధ్యక్షులుగా అనుపురం సర్పంచ్ శేర్ల రాజేశ్వరి మల్లేశం, కొడుముంజ సర్పంచ్ కదిరే రాజు, ప్రధాన కార్యదర్శిగా కొలుగూరి మధు కిరణ్మయి, అధికార ప్రతినిధి జ్వాల స్వాతి సురేశ్‌రెడ్డి, కార్యదర్శిగా దొబ్బల మల్లేశం, సలహాదారుగా ఇటిక్యాల రాజును నియమించారు.
