ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఇచ్చింది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన చిత్రం మంచి హిట్ అవ్వడంతో కృతి శెట్టికి టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో హీరోయిన్ గా నటించే ఆఫర్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం కృతి శెట్టి తెలుగుతోపాటు మలయాళం, తమిళ్ తదితర భాషలో హీరోయిన్ గా నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది.
ఇటీవలే నటి కృతి శెట్టి మీటూ ఉద్యమం గురించి స్పందించింది. ఇందులో భాగంగా లైంగిక వేధింపులు సంఘటనలు తనకి తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటుందని, తాను సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తిని కావడంతో ఇవన్నీ తనని కలవరపెడుతున్నాయని ఎమోషనల్ అయ్యింది.
అయితే చాలామంది క్యాస్టింగ్ కౌచ్ విషయంలో భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారని, ఇప్పుడు తమ కోసం నిలబడటం వారివంతు అని తెలిపింది.
ఈ మధ్యకాలంలో మీటూ ఉద్యమంపై ప్రజలకి అవగాహన పెరిగిందని దీంతో భాదితులు ధైర్యంగా ముందుకు వచ్చి స్పందిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో మీటూ ఉద్యమం సినీ పరిశ్రమలో సానుకూల మార్పులు తెస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా నటి కృతి శెట్టి మలయాళంలో స్టార్ హీరో టోవినో థామస్ హీరోగా నటించిన 'ARM' చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మలయాళం మరియు తెలుగు భాషలలో విదులయ్యింది.