తౌక్తే తుఫాను ఎఫెక్ట్.. మరో ఆరు రైళ్లు రద్దు

తౌక్తే తుఫాను ఎఫెక్ట్.. మరో ఆరు రైళ్లు రద్దు

కరోనా లాక్ డౌన్ దెబ్బకు దాదాపు రైలు సర్వీసులన్నీ రద్దుకాగా.. అడపా.. దడపా నడుస్తున్న రైళ్లు కూడా తౌక్తే తుఫాను దెబ్బకు రద్దయ్యాయి. తౌక్తే తుఫాను ఇంకా తీరం దాటకున్నా.. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఎల్లుండి తీరం దాటనున్న తౌక్తే తుఫాను తీవ్రత అంచనాలకు అందడం లేదన్న హెచ్చరికలతో దక్షిణ మధ్య రైల్వే మరో ఆరు రైళ్లను రద్ధు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తుగా ఆరు రైళ్లను రద్దు చేసింది. 
మే 16 నుంచి నడిచే పూరి-ఓఖా ఎక్స్‌ప్రెస్‌ 
17న నడిచే రాజ్‌కోట్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్ 
18న నడిచే పోరుబందర్‌-సికింద్రాబాద్‌, 18న నడిచే ఓఖా-రామేశ్వరం ట్రెయిన్‌
19న బయలుదేరే ఓఖా-పూరి ఎక్స్‌ప్రెస్‌, అదే రోజు బయలుదేరే సికింద్రాబాద్‌-పోరుబందర్‌ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.