వినాయకుడి నిమజ్జనంలో విషాదం: చెరువులో పడి తండ్రి, కూతుళ్ళ గల్లంతు..

వినాయకుడి నిమజ్జనంలో విషాదం: చెరువులో పడి తండ్రి, కూతుళ్ళ గల్లంతు..

కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిదిలోని నాగులురు చెరువు వద్ద విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి వినాయకుడి నిమజ్జనం చేసేందుకు వెళ్లిన తండ్రి శ్రీనివాస్ (31), కూతురు వెస్లీ (7) అదృశ్యమయ్యారు. అయితే ఆటోలో నిమజ్జనానికి వెళ్తుండగా చీకట్లో బండరాయి అడ్డురావడంతో ఆటో చెరువులో పడినట్లు ఆనవాళ్లను బట్టి  తెలుస్తుంది. సమాచారం అందడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే దీని పై కేసు నమోదు  చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.