డ్రగ్స్ ని కనిపెట్టేందుకు కుక్కలకు ట్రైనింగ్

డ్రగ్స్ ని కనిపెట్టేందుకు కుక్కలకు ట్రైనింగ్

మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్  ట్రైనింగ్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన 33 డాగ్స్ , 47 మంది ట్రైనర్స్ కి పాసింగ్ ఔట్ పరేడ్ చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హోమ్ శాఖ సెక్రెటరీ రవి గుప్త, ఇంటలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ హాజరయ్యారు. మోయినాబాద్ ఐఐటీఏలో ఎనిమిది నెలల పాటు లెబ్రడాల్, జర్మన్ షఫర్డ్,  బెల్జియం మాలినోస్,  గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్స్ కి చెందిన కుక్కలకు తెలంగాణ, గోవాకి చెందిన ట్రైనర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ వింగ్,  బాంబ్ స్క్వాడ్ లో ట్రైన్డ్ డాగ్స్ డ్యూటీలు చేయనున్నాయి. మూడు నెలల వయసున్న కుక్క పిల్లలను తీసుకొచ్చి ఎనిమిది నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ టైమ్ లో ఒక్కో డాగ్ కి ఒక్కో ట్రైనర్ ను కేటాయించారు. పేలుడు పదార్థాలు,  డ్రగ్స్ ని కనిపెట్టడం, నిందితుల ఆచూకీలను కనిపెట్టడం వంటి అంశాల్లో పూర్తి స్ధాయి శిక్షణ అందించారు.