ముగిసిన ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్

ముగిసిన ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్

నల్గొండ, వెలుగు:  ట్రస్మా ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ చర్లపల్లి లోని విపస్య హైస్కూల్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో గేమ్స్ శుక్రవారం ముగిసింది. శుక్రవారం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు బండారు ప్రసాద్,  ట్రస్మా స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ కొలనుపాక రవికుమార్,  కో కన్వీనర్ ముక్కామల రామ్మోహన్ పాల్గొని విజేతలకు ప్రైజులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల స్కూళ్లలో  టీచర్లు, స్టూడెంట్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందుతుందన్నారు.

ఆటల వల్ల విద్యార్థులకు  చదువులో ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. ప్రోగ్రాంలో యన్. రమేశ్ రెడ్డి, అలుగుబెల్లి శ్యాంసుందర్ రెడ్డి,  ఫయాజ్ , యాదయ్య, చర్లపల్లి గణేశ్, నాగేందర్ జానయ్య, మనోజ్, కళ్యాణ్,  బిజు జోసెఫ్, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.